మాంసం తినడం మానేసి నీతులు చెప్పు: పాయల్‌పై ట్రోలింగ్

by Prasanna |   ( Updated:2023-02-07 14:15:05.0  )
మాంసం తినడం మానేసి నీతులు చెప్పు: పాయల్‌పై ట్రోలింగ్
X

దిశ, సినిమా: బ్యూటిఫుల్ పాయల్ రాజ్‌పుత్ నెట్టింట దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. ఇప్పటికే పాయల్ కొన్ని విషయాల్లో చాలా ఓవర్ యాక్షన్ చేస్తోందని, పబ్లిసిటీ స్టంట్ అంటూ తిట్టిపోస్తున్న జనాలు మరోసారి టార్గెట్ చేసి ఆడేసుకుంటున్నారు. విషయానికొస్తే.. ఇటీవల ప్రేమగా ఓ ఆవుకు బిస్కె్ట్లు పెడుతున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. 'జంతువులను ప్రేమించడం ఆపకండి. ఎందుకంటే అవి మనకు ఆనందాన్ని పంచుతాయి. మూగ జీవులను అమితంగా ప్రేమించి మీలోని మంచిని తట్టి లేపండి' అంటూ పలు యానిమల్స్ బొమ్మలను జతచేస్తూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ వైరల్ అవుతుండగా.. 'అయితే నువ్వు చికెన్, మటన్ తినడం మానేయి. అవి కూడా జంతువులే కదా? పెద్ద పెద్ద రెస్టారెంట్లో కోళ్లు, మేకలు, ఆవులను చంపి రుచికరంగా వండిన ఫుడ్ ఎందుకు తింటున్నావ్?' అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : సమంత ఫ్యాన్స్‌కు షాక్.. 'శాకుంతలం' మళ్లీ వాయిదా!

Advertisement

Next Story