Sri Reddy: సంసార పక్షంగా మారిపోతున్న హాట్ బ్యూటీ శ్రీరెడ్డి!

by Prasanna |   ( Updated:2023-03-21 10:06:47.0  )
Sri Reddy: సంసార పక్షంగా మారిపోతున్న హాట్ బ్యూటీ శ్రీరెడ్డి!
X

దిశ, సినిమా: శ్రీ రెడ్డి గురించి పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో హాట్ హాట్ మాటలతో, లుక్స్‌తో కవ్విస్తూ నానా రచ్చ చేస్తూ ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీకి తెరలేపుతూ ఎవరో ఒకరిని తిడుతూ ఉంటుంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీని, దగ్గుపాటి ఫ్యామిలీ, ఇండస్ట్రీలో కొందరు హీరోల‌ను టార్గెట్ చేస్తూ.. మాట్లాడుతూ ఉంటుంది శ్రీ రెడ్డి. ఇలాంటి మాటలు, చేతలతోనే ఆమె నాలుగేళ్లుగా బాగా పాపులర్ అయింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆమె గత కొద్ది రోజుల నుంచి వీటన్నిటికీ దూరంగా ఉంటోంది. సోషల్ మీడియాలోనూ అంతగా కనిపించడం లేదు. బూతు మాటలు ఆపేసి, కృష్ణుడి నామ స్మరణ చేస్తోందట. అందుకోసం ఆమె సొంత దేవాలయం కూడా నిర్మించుకుంది. ఏదేమైనప్పటికీ ఈమెలో మార్పు ఎవరూ ఊహించనిదనే టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి శ్రీ రెడ్డి చాలా మంచిదని కొందరు అంటుంటారు. ఆమెకు 14 ఏళ్ల వ‌య‌స్సులోనే కుటుంబ సభ్యులు పెళ్లి చేయడంతో అది ఇష్టంలేక ఇంట్లో వాళ్లకు చెప్పకుండానే హైదరాబాద్ వచ్చేసింది. తర్వాత ఓ టీవీ ఛానల్‌లో యాంకర్‌గా పనిచేసిన శ్రీరెడ్డి మూవీలో ఛాన్స్ కోసం ట్రై చేసింది. ఎన్నో సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగిన శ్రీరెడ్డి‌ని అప్పట్లో అవకాశాల పేరుతో దర్శక, నిర్మాతలు వాడుకున్నారట. ఈ విషయాన్ని ఆమెనే చాలా సందర్భాల్లో చెప్పింది. అయితే ఇప్పుడు అలాంటి విషయాలన్నీ పక్కనపెట్టిన శ్రీరెడ్డి సంసార పక్షంగా మారుతూ.. కొత్త జీవితానికి స్వాగతం పలికిందట.

Also Read.. మాజీ ప్రియుడి సక్సెస్ కోసం శ్రీరెడ్డి పూజలు.. అతడిని ఇంకా వదలలేదా..?

Keerthy Suresh: గ్లామర్ ఫొటోస్‌తో రచ్చ చేస్తున్న మహానటి?

Advertisement

Next Story