అరేయ్, ఎందుకు రా Anasuya ఆంటీని ఇలా ఏడిపిస్తున్నారు: Sri Reddy ఆసక్తికర వ్యాఖ్యలు

by Hamsa |   ( Updated:2023-08-20 18:06:18.0  )
అరేయ్, ఎందుకు రా Anasuya ఆంటీని ఇలా ఏడిపిస్తున్నారు: Sri Reddy ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: హాట్ బ్యూటీ యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో ఏడుస్తున్న వీడియోను షేర్ చేసి సంచలనం సృష్టించింది. అందరితో అన్ని విషయాలను పంచుకుంటాను. తీవ్రమైన మానసిక బాధను అనుభవిస్తున్నాను. మీరందరూ మంచి ఆరోగ్యంతో, మంచి ఉత్సాహంతో ఉన్నారని ఆశిస్తున్నానంటూ ఆ పోస్ట్‌లో రాసుకొచ్చింది.

తాజాగా, అనసూయ వీడియోపై శ్రీరెడ్డి ఆసక్తికర ట్వీట్ చేసింది. ‘‘అరేయ్, ఎందుకు రా అనసూయ ఆంటీ ని ఇలా ఏడిపిస్తున్నారు, పాపం రా.. ఇంతకి తను ఎందుకు ఏడుస్తుందో చాలా మందికి అర్థం కాలేదు. సింపుల్ గా చెప్పాలంటే, తను లోపల ఒకటి, బయట ఒకటి కాకుండా, తన మనసు ఏం చెప్తే అలా, తన భావాలను, సోషల్ మీడియా లో పంచుకుంటున్నారు. తను చెప్పేది నచ్చని వాళ్ళు, తనకి తప్పుగా కామెంట్స్ చేస్తున్నారు. పాపం అవి తనని బాగా బాధిస్తున్నాయి. నా పోస్ట్ లకు కూడా, చాలా మంది దరిద్రమైన కామెంట్స్ పెడుతున్నారు. తప్పురా అలా చేయకూడదు మంచిగా ఉందాం’’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా అనసూయ ఏడుస్తున్న వీడియోను జత చేసింది.

ఇవి కూడా చదవండి :

ఎందుకు ఏడ్చిందో క్లారిటీ ఇచ్చిన అనసూయ.. ట్రోలర్స్‌కు మరోసారి కౌంటర్

కొత్త ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టిన Samantha.. రూల్స్ ఇవే అంటూ షాకింగ్ కామెంట్స్

Advertisement
Next Story

Most Viewed