ఆమె చేతిలో దారుణంగా మోసపోయిన శ్రీముఖి..అక్క అక్క అంటూ పెద్ద బొక్క పెట్టిందిగా!

by Jakkula Samataha |   ( Updated:2024-05-18 05:12:16.0  )
ఆమె చేతిలో దారుణంగా మోసపోయిన శ్రీముఖి..అక్క అక్క అంటూ పెద్ద బొక్క పెట్టిందిగా!
X

దిశ, సినిమా : యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుల్లితెరపై ఈమె తన యాంకరింగ్‌తో ఓ వెలుగు వెలిగిపోయింది. పటాస్ ప్రోగ్రాంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ తర్వాత పలు షోల్లో చేయడమే కాకుండా మూవీ ఈవెంట్స్‌లో కూడా తన యాంకరింగ్‌తో అందరినీ ఆకట్టుకుంది. అంతే కాకుండా బిగ్ బాస్‌లోకి వెళ్లిన తర్వాత రాములమ్మ గ్రాఫ్ మరింత పెరిగిపోయిందనే చెప్పాలి. లౌడ్ స్పీకర్‌గా, తన ఎనర్జీకి అందరూ ఆమెకు ఆకర్షితులయ్యారు. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో రచ్చ చేస్తుంటుంది. అయితే తాజాగా శ్రీముఖికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అది ఏమిటంటే?

అక్కా అక్కా అంటూనే ఓ యాంకర్ ఈమెకు భారీగా బొక్కపెట్టిందంట. అసలేమైదంటే? విశ్వంభర సినిమాలో శ్రీముఖి ఐటమ్ సాంగ్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఆఫర్‌ను మరో అమ్మాయి ఎగిరేసుక పోయిందంట. శ్రీముఖితో పాటు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ స్థానం అందుకున్న ఈ బ్యూటీ ఆ ఆఫర్ ని కొట్టేసినట్లు తెలుస్తోంది . అంతేకాదు శ్రీముఖిని అక్క అక్క అంటూ పిలిచే బ్యూటీ మెత్తగా బొక్క పెట్టింది అంటూ జనాలు శ్రీముఖిని ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story