- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
SREELEELA:‘హ్యాపీ బర్త్‌డే నా అందమైన సీతాకోకచిలుక’ అంటూ సితార క్యూట్ పిక్ షేర్ చేసిన నటి!
దిశ, సినిమా: అతి తక్కువ సమయంలో టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్గా మారిపోయింది బ్యూటీ శ్రీలీల. ఏ ముహూర్తాన సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిందో తెలియదు కానీ మెరుపు తీగలా వరుస చిత్రాలతో దూసుకుపోయింది. మరీ అలాంటి ఇలాంటి హీరోల సరసన నటించిందంటే.. అది కాదు. ఏకంగా టాలీవుడ్ సీనియర్ స్టార్ డమ్ సంపాదించుకుని తెలుగు ప్రేక్షకుల్లో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న అగ్ర హీరోల(మాస్ మహారాజా రవితేజ, నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు) సరసన నటించి.. కొద్ది రోజుల్లోనే రికార్డు బ్రేక్ చేసింది. ఏ థియేటర్కెళ్లిన ఈ అమ్మడు సినిమాలతో బక్సాఫీసు బద్దలైంది. అందం, యాక్టింగ్ పక్కన పెడితే.. ముఖ్యంగా తన డాన్స్‌తో కుర్రాకారు నుంచి ముసలివారికి సైతం చెమటలు పట్టించిందనడంతో అతిశయోక్తిలేదు.
సీనియర్ స్టార్ హీరోయిన్లను సైతం పక్కన పెట్టి.. ఈ అమ్మడు బాట పట్టారు దర్శక, నిర్మాతలు. ప్రస్తుతం శ్రీలీలకు అవకాశాలు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. ఈ కుర్ర హీరోయిన్ నటించిన పలు చివరి చిత్రాలు కూడా ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. ఇదంతా పక్కన పెడితే.. ఈ క్యూటీ.. మరో క్యూటీ ఘట్టమనేని సితారకు.. సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టికి సోషల్ మీడియా వేదికన పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ‘‘హ్యాపీ బర్త్ డే నా అందమైన సీతాకోకచిలుక లవ్ యూ’ అంటూ తెలుపు రంగు లవ్ సింబల్స్ జోడించింది. శ్రీలీల పోస్ట్‌కు నెటిజన్లు ‘ఘట్టమనేని గారాల పట్టి తొందర్లోనే సినీ ఇండస్ట్రీకి రావాలని కోరుకుంటున్నామంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.’ ఇక గతంలో నమ్రత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సితారకు యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్ ఉందని చెప్పిన విషయం తెలిసిందే. సితార సినీ ఎంట్రీపై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.