Sreeleela : కోలీవుడ్ నుంచి పిలుపు అందుకున్న శ్రీలీల.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్?

by Prasanna |   ( Updated:2024-08-28 14:42:20.0  )
Sreeleela : కోలీవుడ్ నుంచి పిలుపు అందుకున్న శ్రీలీల.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్?
X

దిశ, వెబ్ డెస్క్: యంగ్ హీరోయిన్ శ్రీలీల మనందరికీ సుపరిచితమే. ఒకప్పుడు ఈమె కోసం హీరోలు కూడా వెయిట్ చేసే వాళ్లు కానీ, ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో ‘గుంటూరు కారం’ మూవీతో ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీకి ఈ మధ్య తెలుగులో అవకాశాలు చాలా వరకు తగ్గిపోయాయి. కానీ, ఇక్కడ ఛాన్సులు రాకపోయినా ఇతర భాషల్లో బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ నుంచి కబురు రాగా.. తాజాగా కోలీవుడ్ లోకి కూడా అడుగు పెట్టబోతుందంటూ వార్తలు వస్తున్నాయి.

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డాక్టర్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. సుధా కొంగర డైరెక్షన్లో ఓ మూవీ పట్టాలెక్కనున్నట్లు సినీ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో శివకార్తికేయన్‌కు జంటగా శ్రీలీలను ఓకే చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే వీళ్ళపై ఫొటోషూట్‌ పూర్తి అయిందని అనుకుంటున్నారు. దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed