పలుచటి చీరలో మెరిసిపోతున్న శ్రీలీల.. హాట్, హాటెస్ట్ అంటూ నెట్టింట ప్రశంసలు

by Hamsa |
పలుచటి చీరలో మెరిసిపోతున్న శ్రీలీల.. హాట్, హాటెస్ట్ అంటూ నెట్టింట ప్రశంసలు
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు పెళ్లి సందడి మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ధమాకాతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుని మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది. వరుస సినిమా ఆఫర్లు అందుకుని.. స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. ఇక అమ్మడు క్రేజ్‌కు ఇండస్ట్రీని షేక్ చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ వరుసగా నాలుగు ఫ్లాప్‌లు అందుకోవడంతో.. శ్రీలీల క్రేజ్ ఒక్కసారిగా పడిపోయింది. అయితే కొద్ది కాలం ఈ అమ్మడు సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి యాడ్స్ చేసింది.

ఇక ఇప్పుడు మళ్లీ ఆఫర్లు అందుకుంటూ ఫామ్‌లోకి వస్తుంది. ప్రస్తుతం మూడు, నాలుగు స్టార్ హీరోల సినిమాల్లో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ బిజీగా మారి వరుస పోస్టులతో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా, ఈ అమ్మడు లైట్ బ్లూ కలర్ పలుచటి చీర కట్టి మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లను మైమరిపిస్తోంది. బ్యూటీ అందాలకు ఫిదా అయిపోతున్న నెటిజన్లు దువ్వాడ జగన్నాధం డైలాగ్‌ను ఉపయోగించి హాట్, హాటర్, హాటెస్ట్ అని కామెంట్లు పెడుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed