‘ఆర్ఆర్ఆర్’ చూసి ఫిదా అయ్యాను.. టామ్ హాలండ్

by Anjali |   ( Updated:2023-06-05 12:04:00.0  )
‘ఆర్ఆర్ఆర్’ చూసి ఫిదా అయ్యాను.. టామ్ హాలండ్
X

దిశ, సినిమా: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇప్పటికి కూడా ప్రతి చోట, ప్రతి ఒక్కరి చేత ప్రశంసించ పడుతుంది. అయితే తాజాగా ఈ మూవీపై హాలీవుడ్ నటీనటులు ‘స్పైడర్ మ్యాన్’ హీరో టామ్ హాలండ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రీసెంట్‌గా ముంబైలో జరిగిన నీతా అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవానికి టామ్ హాలండ్ ఇండియా వచ్చి వెళ్లారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడుతూ.. ‘నాకు భారత్ పర్యటన ఎన్నో మంచి జ్ఞాపకాలనిచ్చింది. ఆహ్వానించినందుకు అంబానీ కుటుంబానికి ధన్యవాదాలు. ఇక్కడికొచ్చాక ‘RRR’ మూవీ చూశాను. నాకు చాలా నచ్చింది. హీరోల యాక్టింగ్ చాలా బాగుంది’ అంటూ మెచ్చుకున్నాడు.

Also Read: షారుఖ్ రొమాన్స్ చూస్తూ ఇలా తయారయ్యాను.. అమెరికన్ నటి

గోల్కొండ కోటలో ‘శంకర్ మహదేవన్’.. ఘనంగా వేడుకలు!

Advertisement

Next Story