Patang: ‘పతంగ్‌’ నుంచి సాంగ్ రిలీజ్.. యూత్‌ను ఆకట్టుకుంటున్న ‘అందాల తారకాసి.. రాకాసి’ ట్యూన్

by sudharani |
Patang: ‘పతంగ్‌’ నుంచి సాంగ్ రిలీజ్.. యూత్‌ను ఆకట్టుకుంటున్న ‘అందాల తారకాసి.. రాకాసి’ ట్యూన్
X

దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో అనేక చిత్రాలు వచ్చాయి. కానీ మొదటిసారి పతంగుల పోటీతో రాబోతున్న చిత్రం ‘పతంగ్’. కామెడీ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కతున్న ఈ సినిమాని సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిష‌న్ సినిమాస్ ప‌తాకంపై విజ‌య్ శేఖ‌ర్ అన్నే, సంప‌త్ మ‌క, సురేష్ కొత్తింటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రణీత్ ప్రత్తిపాటి ద‌ర్శకత్వం వహించగా.. ఈ చిత్రంలో ఇన్‌స్టాగ్రమ్ సెన్సేష‌న్ ప్రీతి ప‌గ‌డాల‌, జీ స‌రిగ‌మ‌ప ర‌న్నర‌ప్ ప్రణ‌వ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ ముఖ్యతార‌లుగా న‌టిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంది ఇందులో నుంచి తాజాగా.. ‘అందాల తారకాసి.. రాకాసి.. నా గుండె కోసి కోసి కోరికేయకే’ అంటూ సాగే లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ.. ‘యూత్‌ఫుల్‌ మెలోడిగా సాంగ్‌గా తెరకెక్కిన ఈ పాట యూత్‌తో పాటు అందరిన్ని అలరిస్తుంది. ఈ పాట మెలోడి సాంగ్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా నిలబడుతుందనే నమ్మకం ఉంది. క్యాచీ లిరిక్స్‌తో.. ఫ్రెష్‌ ట్యూన్‌తో ఈ సాంగ్ మెస్మరైజ్‌ చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు’ అని చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed