దొంగోడే దొరగాడు.. ‘బెదురులంక 2012’ నుంచి సాంగ్ రిలీజ్..!

by samatah |   ( Updated:2023-12-17 15:15:51.0  )
దొంగోడే దొరగాడు.. ‘బెదురులంక 2012’ నుంచి సాంగ్ రిలీజ్..!
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ, నేహా శెట్టి హీరోయిన్ గా క్లాక్స్ రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బెదురులంక 2012’ . అజయ్ ఘోష్, సత్య, రాజ్ కుమార్ కాసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సురభి పద్మావతి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు రిలీజైన ప్రతీ అప్ డేట్ ఎంతగానో ఆకట్టుకోగా.. తాజాగా ‘దొంగోడే దొరగాడు’ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. కిట్టు విస్సా ప్రగడ లిరిక్స్ అందించగా.. సాహితి చాగంటి పాడిన పాట ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Advertisement

Next Story