ప్రభాస్‌పై ఆసక్తికర పోస్ట్ పెట్టిన నభా.. ప్రియదర్శి అలా అనడంతో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బ్యూటీ!

by Disha Web Desk 6 |
ప్రభాస్‌పై ఆసక్తికర పోస్ట్ పెట్టిన నభా.. ప్రియదర్శి అలా అనడంతో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బ్యూటీ!
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ నభా నటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు కన్నడ, తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా రామ్ పోతినేని సరసన నటించిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో నభా నటేష్‌కు చెప్పలేనంత క్రేజ్ వచ్చి పడింది. ఆ తర్వాత పలు మూవీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న క్రమంలో ఈ అమ్మడుకి యాక్సిడెంట్ అయింది. దీంతో కొద్ది కాలం నటనకు దూరమైంది. ప్రస్తుతం హీరో నిఖిల్ పాన్ ఇండియా మూవీ స్వయంభు లో నటిస్తుంది. ఇదిలా ఉంటే.. నభా నటేష్ తాజాగా, తన సోషల్ మీడియా వేదికగా ప్రభాస్‌ను డార్లింగ్ అంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది.

దీంతో అది చూసిన నటుడు ప్రియదర్శి వావ్ సూపర్ డార్లింగ్ కిరాక్ ఉన్నావ్ అని రాసుకొచ్చాడు. దానికి నభా మిస్టర్ కామెంట్ చేసే ముందు మాటలు జాగ్రత్త డార్లింగ్ అంటే లైంగిక వేధింపుల కిందకు వస్తుందని చెప్పింది. దీంతో ప్రియదర్శి.. ‘‘ మీరేమో డార్లింగ్ అని పిలవచ్చు. మేము పిలిస్తే ఐపీసీ సెక్షన్ పెడతారా? లైట్ తీస్తో డార్లింగ్ అని కామెంట్ పెట్టాడు. ఇక అది చూసిన నభా లైన్ క్రాస్ అవ్వొద్దు చూసుకుందాం అనగా.. ప్రియదర్శి వై దిస్ కొలవెరి అని ఫన్నీ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరి చిట్ చాట్ నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో అది చూసిన నెటిజన్లు కావాలని నెట్టింట పోస్టులు చేసుకుని హంగామా చేస్తున్నారని అంటున్నారు.

Next Story

Most Viewed