Gilberti: 70 ఏళ్ల వయసులో ప్రేమ కోసం వృద్ధుడు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

by Disha Web Desk 3 |
Gilberti: 70 ఏళ్ల వయసులో ప్రేమ కోసం వృద్ధుడు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
X

దిశ వెబ్ డెస్క్: సాధారణంగా టీనేజ్‌లో ఉన్న యువతీ యువకులు ప్రేమలో పడడం నిత్యం చూస్తూనే ఉంటాం. తరగతి గదిలోనో, బంధువులు, స్నేహితుల పెళ్లిలో అమ్మాయిని అబ్బాయి ఇష్టపడటం, అబ్బాయిని అమ్మాయి ఇష్టపడటం చూస్తూనే ఉంటాం. అయితే ఒక 70 ఏళ్ల వృద్ధుడు ప్రస్తుతం అమర ప్రేమికుడై ప్రేయసి కోసం ఎదురు చూస్తున్నాడు.

తనని అర్థం చేసుకునే అర్ధాంగి కోసం హోర్డిగులు పెట్టిమరీ, ఎవరైనా మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఉన్నవాళ్లు తనని సంప్రదించవచ్చు అని బహిరంగంగా ప్రకటనలు ఇస్తున్నారు.ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన గిల్బర్టీ అనే వృద్ధుడు, ఒంటరి జీవితంలో విసిగిపోయాడు. దానితో తన 70 ఏళ్ల వయసులో ఒక తోడు కావాలని కోరుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో మహిళలకి ఎవరికైనా పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే తనని సంప్రదించాల్సిందిగా ఆ 70 ఏళ్ల వృద్ధుడు హార్డింగులు పెట్టారు. కాగా ఆ హార్డింగులు చూసిన వాళ్లంతా తనకి ఫోన్ చేసి వాళ్లకు డబ్బు సాయం చేయాల్సిందిగా అడుగుతున్నారని ఆ వృద్ధుడు తెలిపారు. తాను ఎంతగా ఎదురు చూసినా.. తన హృదయాన్ని మెచ్చే యువతి నుంచి మాత్రం ఎలాంటి కాల్స్ రావట్లేదు అని వాపోతున్నారు. 70 ఏళ్ల వయసున్న తాను, తనకి ఈ వయసులో నిజమైన ప్రేమ దొరికితే ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తాను వెల్లడించారు.

Next Story

Most Viewed