చాలా బాధగా ఉంది నిన్ను ఎంతో మిస్ అవుతున్నాను.. మంచు లక్ష్మి ఎమోషనల్ పోస్ట్

by Hamsa |   ( Updated:2024-02-16 09:13:30.0  )
చాలా బాధగా ఉంది నిన్ను ఎంతో మిస్ అవుతున్నాను.. మంచు లక్ష్మి ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో మోహన్ బాబు కూతురిగా మంచు లక్ష్మి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆమె పలు చిత్రాల్లో నటించినప్పటికీ హిట్ అందుకోలేకపోయింది. అయితే మంచు లక్ష్మి సోషల్ మీడియా ద్వారా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అలాగే ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టి అందులో తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరైంది. ఇటీవల మంచు లక్ష్మి తన హాట్ ఫొటోలు షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ స్టార్ కిడ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ భార్య అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించింది.

యోగా టీచర్‌గా పనిచేసిన ఆమె చనిపోవడంతో మంచు లక్ష్మి స్పందించింది. ఆమె చివరిగా చాట్ చేసిన మిసేజ్‌ను షేర్ చేస్తూ ఎమోషనల్ అయిపోయింది. ‘‘ఇది రూహీ నుండి నా చివరి సందేశం. నేను హైదరాబాద్‌లో వర్కవుట్ చేసినప్పుడు ఆమె నేర్పినందున నేను దాదాపు ప్రతి వారం ఆమెను చూశాను. తన ముఖంలో ఎప్పుడూ ఎలాంటి కల్మషం లేని నవ్వుతో కనిపిస్తూ ఉండేది. దవడలు నొప్పి వచ్చేవరకు నవ్వుతూనే ఉండేవాళ్లం. నా స్త్రీత్వాన్ని కనుగొని దానిలో జీవించమని ఆమె నన్ను ఎప్పుడూ ప్రోత్సహించేది. ఈ శాశ్వత ప్రయాణంలో మా బట్టలు తడిసే వరకు నవ్వాము డ్యాన్స్ చేశాము. ప్రతి క్షణాన్ని పట్టి ఉంచుకోవాలి.. ఏదీ శాశ్వతం కాదని మరోసారి నిరూపించారు. మీరు ఇంత త్వరగా మమ్మల్ని విడిచి పెట్టినందుకు నేను చాలా బాధపడ్డాను.

సెంథిల్, సార్ ఇద్దరు చిన్న పిల్లల గురించి ఆలోచిస్తుంటే మనసు కలుక్కుమంటుంది. కానీ మీరు జీవితానికి సరిపడా ప్రేమను పంచి వెళ్లిపోయారని నేను ఊహిస్తున్నాను. నీతో ప్రయాణం చేసినందుకు ఎంతో అదృష్టవంతులం. ఎందుకంటే నువ్వు ఎప్పుడూ మాకు సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లు చేసేదానివి. రూహీ దేవదూతలను గాఢంగా ఊపిరి పీల్చుకునేలా చేస్తున్నావు. మీరు వారిని బలమైన ఆసన సాధనలో ఉంచుతున్నారని నేను ఆశిస్తున్నాను. నేను నిన్ను ఎంతో మిస్సవుతున్నాను.. నన్ను నన్ను చూడడానికి రాలేవు. నేను ఈ పోస్ట్ చేస్తున్నానని నమ్మలేకపోతున్నాను. నేను ఈ రోజు ప్రతి క్షణాన్ని మీ పేరు మీద కొంచెం అదనంగా జరుపుకుంటాను. ప్రేమలో శాశ్వతమైన శాంతితో విశ్రాంతి తీసుకుంటాను.. మీ స్నేహితురాలు, లక్ష్మి’’ అంటూ రాసుకొచ్చింది. ఇక అది చూసిన నెటిజన్లు రెస్ట్ ఇన్ పీస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story