శివకార్తికేయన్ 'SK 20' ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్

by GSrikanth |
శివకార్తికేయన్ SK 20 ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్
X

దిశ, సినిమా : ఇటీవల కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్.. 'డాన్' సినిమాతో సూపర్ హిట్‌ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 'జాతిరత్నాలు' డైరెక్టర్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో 'SK20' సినిమాతో తెరపైకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'SK20' ఫస్ట్ లుక్ పోస్టర్‌ని జూన్ 9న రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు మేకర్స్. కానీ, ఏ టైంలో విడుదల చేస్తారనేది క్లారిటీ ఇవ్వలేదు. ఇక అనుదీప్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మారియా ర్యాబొశష్క హీరోయిన్‌గా కనిపిస్తున్నారు. థమన్ సంగీతం అందించనున్న సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనుంది.

Advertisement

Next Story