Simmba: ఈ మూవీకి అవార్డులు కూడా వస్తాయి.. అనసూయ సినిమాపై నిర్మాత కామెంట్స్

by sudharani |
Simmba: ఈ మూవీకి అవార్డులు కూడా వస్తాయి.. అనసూయ సినిమాపై నిర్మాత కామెంట్స్
X

దిశ, సినిమా: అనసూయ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సింబా’. సంపత్ నంది, దాసరి రాజేందర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. మురళీ మనోహర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తాజాగా చిత్ర నిర్మాత రాజేందర్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు. 'నేడు సమాజంలో ఉన్న ఓ బర్నింగ్‌ ఇష్యూను తీసుకుని దానికి కమర్షియాల్‌ అంశాలు జోడించి ఈ సినిమాను నిర్మించాను. ప్రస్తుతం మనం ఎలాంటి కాలుష్య వాతావరణంలో ఉన్నమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రకృతి మీద అవగాహన, పర్యావరణ పరిరక్షణ అవసరం ఎంత ఉంది? అనే అంశాన్ని ఇందులో చర్చించాం.. కేవలం సందేశాత్మక సినిమాలా కాకుండా అన్ని వాణిజ్య అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. దర్శకుడు సంపత్‌ నంది చెప్పిన కథ బాగా నచ్చడంతో ఈ సినిమా చేశాను. సింబా అంటే అడివికి రాజు సింహం. పైగా అమ్మవారి వాహనం. ఇందులో అడివిని కాపాడే వ్యక్తిగా కనిపిస్తాడు. అందుకే సింబా అనే పవర్ ఫుల్ టైటిల్‌ను పెట్టాం. సినిమా చూసి కొంత మందిలో ఆలోచన కలిగినా నాకు చాలు. అదే నాకు సక్సెస్. అలా నేను పూర్తిగా సంతృప్తి చెందితేనే సినిమాలు చేస్తాను. సెన్సార్ వాళ్లు కూడా సినిమా చూసి అభినందించారు’ సినిమాకు అవార్డులు కూడా వస్తాయనే నమ్మకం వుంది. ఇలాంటి కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్‌ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తే మరిన్ని మంచి సినిమాలు నిర్మించాలనే ధైర్యం కలుగుతుంది' అన్నారు.

Advertisement

Next Story