ఆయనతో జర్నీ ఏదో తెలియని అనుభూతినిచ్చింది : కియారా

by Hamsa |   ( Updated:2022-08-13 09:14:58.0  )
ఆయనతో జర్నీ ఏదో తెలియని అనుభూతినిచ్చింది : కియారా
X

దిశ, సినిమా : బీటౌన్ యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా తన కోస్టార్ కియారా అద్వానీతో సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నాడు. వారిద్దరూ జంటగా నటించిన 'షేర్‌షా' మూవీ ఆగస్టు 12తో ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌‌లో అభిమానులతో ముచ్చటించారు. ఈ మూవీ షూటింగ్ కోసం చండీగఢ్ నుంచి పాలంపూర్ సమీపంలోని ఒక మఠానికి చేరేందుకు లాంగ్ జర్నీ చేసినట్లు గుర్తుచేసుకున్నాడు. కారులో తామిద్దరం పక్కపక్కనే కూర్చున్నప్పటికీ ఎవరి పనుల్లో వాళ్లు లీనమైపోయామని, కియారా ప్రైవేసీని ఎప్పుడూ గౌరవిస్తానని తెలిపాడు.

అయితే కియారా మాత్రం ఆ టైమ్‌లో తన ఇన్నర్ ఫీలింగ్స్ బయటకు రాలేదని, దేనిగురించి మాట్లాడాలో కూడా అర్థం కాలేదని పేర్కొంది. కానీ సిద్ధార్థ్‌తో చేసిన జర్నీలో ఏదో తెలియని అనుభూతిని పొందినట్లు వెల్లడించింది. ఇక తమ కలయికలో మరో సినిమా రాబోతుందంటూ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ఈ జోడీ.. కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

అప్పుడలా.. ఇప్పుడిలా.. 'కొత్తబంగారులోకం' హీరోయిన్

Advertisement

Next Story