అందానికి కారణం సంతూర్ సబ్బేనా? శ్వేత బోల్డ్ పిక్స్‌పై ట్రోలింగ్

by samatah |   ( Updated:2022-12-01 15:34:00.0  )
అందానికి కారణం సంతూర్ సబ్బేనా? శ్వేత బోల్డ్ పిక్స్‌పై ట్రోలింగ్
X

దిశ, సినిమా: ప్రముఖ టెలివిజన్ నటి శ్వేతా తివారీ తన కుమారుడు రేయాన్ష్ ఆరవ పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించింది. రోజంతా ఉద్యానవనంలో తిరుగుతూ చిన్నపిల్లలా మారిపోయి తెగ అల్లరి చేసింది. ఇక ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి మురిసిపోయిన నటి.. 'బెస్ట్ హోలిడే స్టేయింగ్. ఇమేజికా వరల్డ్‌లో చాలా ఎంజాయ్ చేశా. రియాన్ష్ పుట్టినరోజును గుర్తుండిపోయేలా చేసినందుకు నోవెటెల్ ఇమేజికాకు ధన్యవాదాలు. అన్ని ఏర్పాట్లు చేసినందుకు వికాస్ కాలంత్రికి థాంక్స్' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇదిలావుంటే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫొటోలపై భిన్నంగా స్పందిస్తున్న నెటిజన్లు.. తను స్విమ్మింగ్ సూట్‌ ధరించి ఫొటోలకు పోజులివ్వడంపై ట్రోలింగ్ మొదలు పెట్టారు. 'ఫెయిర్ అండ్ లవ్లీ మోడల్ కంటే అందంగా మెరుస్తుంది. ఆ అందానికి కారణం సంతూర్ సబ్బేనా?', 'అంత పెద్ద పిల్లలున్నా.. నీ అందం రోజురోజుకు రెట్టింపు అవుతుంది' అంటూ బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు.

READ MORE

'mukhachitram': ఇద్దరి మధ్య జరిగే ట్రై యాంగిల్ లవ్ స్టోరి

Advertisement

Next Story