- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాకు పచ్చబొట్లంటే పిచ్చి.. నటిని కాకపోతే అక్కడ కూడా వేయించుకునేదాన్ని
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ శృతిహాసన్ తాను సినిమాల్లోకి రాకపోయుంటే ఏ వృత్తిలో స్థిరపడేదో వెల్లడించింది. రీసెంట్‌గా ఇన్‌స్టాలో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ నిర్వహించిన ఆమె అభిమానులు అడిగిన ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసింది. ఈ మేరకు 19ఏళ్ల వయసులోనే టాటూస్ వేయించుకున్నానని, ఒకవేళ నటిని కాకుంటే ముఖం, ఒంటినిండా పచ్చబొట్లు వేయించుకునేదాన్నని చెప్పింది. ఇక తాను సినిమాల్లోకి రాకపోతే సేల్స్ గర్ల్స్ వర్క్ చేయాలని కోరిక ఉండేదని, షాపింగ్ వెళ్లినపుడు ఇప్పటికీ వాళ్లతో చాలాసేపు ముచ్చటిస్తానని తెలిపింది. ఇక సున్నిత మనస్తత్వం కలిగివున్న తాను చిన్న చిన్న విషయాలకే ఏడుస్తానని, అయితే అది అందరిముందు కాదని తెలిపింది. ‘శంతను ఆర్ట్ నచ్చి ఇన్‌స్టాలో ఫాలో అయ్యాను. అలా మా ప్రేమ మొదలైంది. బోరింగ్ ప్రశ్నలు నాకు అసలే నచ్చవు. నా దృష్టిలో నేను స్టార్‌గా భావించను. మా నాన్నే పెద్ద హీరో. నేను స్వయంగా సంపాదించుకున్నదే నాదిగా భావిస్తా. యాక్టింగ్, సింగింగ్ అంటే చాలా ఇష్టం. ప్రతి క్యారెక్టర్ వందశాతం ఫర్ఫెక్ట్‌గా చేయాలనుకుంటా’ అంటూ పలు విషయాలు చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి : బ్రేకింగ్: నవదీప్‌ను అరెస్ట్ చేయొద్దు.. డ్రగ్స్ కేసులో హీరోకు బిగ్ రిలీఫ్..!