సలార్‌లో శ్రుతి హాసన్‌ కంటే శ్రియా రెడ్డికే ఎక్కువ క్రేజ్..

by Prasanna |
సలార్‌లో శ్రుతి హాసన్‌ కంటే శ్రియా రెడ్డికే ఎక్కువ క్రేజ్..
X

దిశ, వెబ్ డెస్క్: పొగరు సినిమాలో విలన్‌గా కనిపించి, అద్భుతంగా నటించిన శ్రియా రెడ్డి మనందరికీ సుపరిచితమే. ఆ సినిమాని విశాల్ సోదరుడు విక్రమ్ కృష్ణ నిర్మించాడు. ఇక ఆ టైంలోనే విక్రమ్ శ్రియాల పెళ్లి కూడా అయింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తమిళం, తెలుగు ఇలా అన్ని భాషల్లో మంచి ఆఫర్లు వచ్చాయి. అద్భుతమైన నటిగా ఆమెకు పేరు వచ్చింది. శ్రియా రెడ్డి ఇప్పుడు సలార్ సినిమాలో రాధా రమా అనే అద్భుతమైన పాత్రలో కనిపించి అందరినీ ఆకట్టుకుంది.

ఈ సినిమా చూసాక.. శ్రుతి హాసన్ కంటే.. శ్రియా రెడ్డి ఎక్కువగా అట్రాక్ట్ చేసిందని ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. యానిమల్ సినిమాలో రష్మిక కంటే తృప్తి డిమ్రీ ఎలా ఫేమస్ అయిందో.. అలా ఈ మూవీలో శ్రుతి హాసన్ కంటే శ్రియా రెడ్డి ఎక్కువ ఫేమ్ తెచ్చుకుంది.సలార్ నుంచి బయటకొచ్చిన అందరూ ఎక్కువగా శ్రియా రెడ్డి గురించే చెప్తున్నారు. అలా శ్రియా రెడ్డి గురించి ఇప్పుడు వెదుకులాట స్టార్ట్ చేశారు నెటిజన్లు.

Advertisement

Next Story