- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
ప్రెజెంట్ గర్ల్ ఫ్రెండ్నువదిలేసిన హీరో.. ఆ హీరోయిన్‌కు కంగ్రాట్స్ చెప్తూ గిఫ్ట్ పంపిన ఎక్స్ లవర్..
దిశ, సినిమా : బ్యూటిఫుల్ యంగ్ లేడీ అనన్యా పాండే హీరో ఆదిత్యా రాయ్ కపూర్ తో రిలేషన్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతూనే ఉంది. ఇద్దరు కలిసి ఫారిన్ ట్రిప్స్ కు వెళ్ళడం, అక్కడే ఫోటోలకు చిక్కడంతో సీక్రెట్ రిలేషన్ కాస్తా పబ్లిక్ అయిపోయింది. కానీ ఎప్పుడూ అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వలేదు. అయితే కొన్ని షోస్ కు అటెండ్ అయిన అనన్య మాత్రం ఆదిత్య పేరు వినిపించిన ప్రతిసారి సిగ్గు పడిపోవడం, పోసేసివ్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకోవడంతో కొద్దిగా ఓపెన్ అయినట్లే అనిపించింది. కానీ అంతలోనే వీరిద్దరికి బ్రేక్ అప్ అయినట్లు బాలీవుడ్ టాక్.
అయితే ఈ టైంలో ఆదిత్య ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్.. అనన్యకు గిఫ్ట్ పంపించడం టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. నిజానికి శ్రద్ధ బహుమతి ఇచ్చిన విషయం అనన్య ట్విట్టర్ ద్వారా తెలుపగా.. దీనికి మీనింగ్ ఏంటని చర్చించుకుంటున్నారు నెటిజన్లు. ఆదిత్య రిలేషన్ నుంచి బయటపడినందుకు కంగ్రాట్స్ చెప్పిందా అని కామెంట్స్ చేస్తున్నారు.