Shraddha Kapoor: నా ఫిట్‌నెస్‌కు కారణం అదే.. ప్రతిరోజూ చేయాల్సిందే!

by Prasanna |
Shraddha Kapoor: నా ఫిట్‌నెస్‌కు కారణం అదే.. ప్రతిరోజూ చేయాల్సిందే!
X

దిశ, సినిమా : బ్యూటీఫుల్ యాక్ట్రెస్ శ్రద్ధాకపూర్‌ తన స్కిన్‌కేర్‌ అండ్ ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌ను బయటపెట్టింది. ఈ మేరకు 'క్రీమ్స్‌, ఫేస్‌ప్యాక్స్‌ వద్దని ఇంటి చిట్కాలే ముద్దని హితవు పలుకుతూ తాజా ఇంటర్య్వూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'ఆరోగ్యకరమైన కురులకోసం డబ్బులు ఖర్చు పెట్టి పార్లర్‌ల చుట్టూ తిరగను. ఇంట్లో, పెరట్లో లభించే కలబంద గుజ్జు, మందార ఆకులు లేదా పువ్వులు, కాస్త పెరుగుతో చేసిన మిశ్రమాన్ని తలకు రాస్తుంటాను. అలాగే కరోనా సమయంలో జిమ్‌లన్నీ మూతపడ్డా.. నేను వర్కవుట్స్‌ని ఆపలేదు. వీడియో కాల్‌ ద్వారా నా ట్రైనర్‌ సూచనలతో టెర్రస్‌పై ప్రాక్టీస్‌ చేసేదాన్ని. ఫిట్‌నెస్‌ విషయంలో నేను పర్‌ఫెక్ట్‌. ప్రతిరోజు డ్యాన్స్‌ చేయాల్సిందే. నాకు డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం. ఇది నా దినచర్యలో భాగమైపోయింది. డ్యాన్స్‌ బెస్ట్‌ మెడిసన్‌ అని నమ్ముతా. నేను ఫిట్‌గా, సంతోషంగా ఉండటానికి కారణం డ్యాన్స్‌ చేయడమే' అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed