- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘‘నిన్ను.. నీ నవ్వును ఎప్పటికీ మర్చిపోలేము’’.. శ్రద్ధా దాస్ ఎమోషనల్ పోస్ట్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: ఢీ షో కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అప్పుల బాధలు తట్టుకోలేకపోతున్న అంటూ ఉరేసుకుని చనిపోయారు. చైతన్య మాస్టర్ మరణం ఒక్కసారిగా అందరిని షాక్‌కు గురయ్యేలా చేసింది. ఎప్పుడూ నవ్వుతూ.. నవ్విస్తూ ఉండే మాస్టర్ చనిపోవడం నమ్మలేకపోతున్నామంటూ పలువురు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్ శ్రద్ధాదాస్ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
ఈ మేరకు ఢీ షోలో చైతన్య మాస్టార్‌తో కలిసి డాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేస్తూ.. ‘మనం పుట్టిన దగ్గర నుంచి జీవించే చివరి రోజు వరకు ఎలా బతికామన్నది మన గొప్పతనాన్ని సూచిస్తుంది. నిజం చెప్తున్నా.. చైతన్య మాస్టర్ చాలా మంచి వ్యక్తి. మాస్టర్ తన చుట్టూ ఉన్న వాళ్లను ఎప్పుడూ నవ్విస్తూనే ఉంటారు. ఆయన మరణ వార్త తెలిసినప్పటి నుంచి కంటనీరు ఆగలేదు. నిన్ను, నీ నవ్వును మర్చిపోలేము చైతన్య’’ అంటూ రాసుకొచ్చారు.
ఇవి కూడా చదవండి : సినీ ఇండస్ట్రీలో నంది అవార్డుల రగడ