- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
షాకింగ్ న్యూస్.. పేరు మార్చుకున్న ఎన్టీఆర్.. ఏం యాడ్ చేసుకున్నారంటే! (పోస్ట్)
దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ప్రజెంట్ దేవర సినిమాతో ప్రేక్షకుల రాబోతున్నాడు. దీనిని కొరటాల శివ తెరకెక్కిస్తుండగా.. ఇందులో యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపించనున్నాడు. దేవర మూవీ సెప్టెంబర్ 27న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే ఇటీవల ఎన్టీఆర్‌కు సంబంధించిన షూటింగ్ పూర్తి అయిన విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఆయనకు రోడ్డు ప్రమాదం జరిగినట్లు అందులో గాయాలైనట్లు వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో ఆయన టీమ్ అధికారికంగా ఆయనకు ప్రమాదం జిమ్‌లో జరగడం వల్ల చేతికి గాయం అయినట్లు ఫొటో రివీల్ చేశారు. దీంతో పుకార్లకు చెక్ పడినట్లు అయింది. ఇదిలా ఉంటే.. తారక్ పేరు మార్చుకున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దానికి కారణం.. ఇటీవల ఎన్టీఆర్ టీమ్ విడుదల చేసిన ప్రకటన.
అందులో జూనియర్ ఎన్టీఆర్ అనే ట్యాగ్ కాకుండా మిస్టర్ అని ఉపయోగించడంతో దానిని ఆధారంగా తీసుకుని నెట్టింట ఆయన పేరులో మార్పులు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. మిస్టర్ ట్యాగ్ సెట్ కాలేదని కామెంట్లు పెడుతున్నారు. కానీ కొందరు మాత్రం వాటిల్లో ఎలాంటి నిజం లేదని వాదిస్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ సోషల్ మీడియా ఖాతాల్లో జూనియర్ ఎన్టీఆర్ అనే ఉండటంతో ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు.
- Tags
- Young Tiger NTR