Shobhita Dulipala: బేబి బంప్ ఫొటో షేర్ చేసిన శోభిత దూళిపాళ.. షాక్‌లో అక్కినేని ఫ్యాన్స్

by Hamsa |
Shobhita Dulipala: బేబి బంప్ ఫొటో షేర్ చేసిన శోభిత దూళిపాళ.. షాక్‌లో అక్కినేని ఫ్యాన్స్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ శోభిత దూళిపాళ మోడల్‌గా పరిచయం అయి మిస్ ఇండియా పోటీల్లో రెండో స్థానం సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు సినిమాలు వెబ్‌సిరీస్‌లో నటించి మెప్పించింది. ఇటీవల ఈ అమ్మడు ‘మంకీ మ్యాన్’తో ప్రేక్షకులను అలరించింది. ఇక ప్రజెంట్ శోభిత నటించిన ఓటీటీ సినిమా ‘లవ్ సితార’ జీ5లో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ అమ్మడు పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. గత కొద్ది కాలంగా నాగచైతన్యతో ప్రేమలో ఉన్న ఆమె ఇటీవల నిశ్చితార్థం చేసుకుంది.

ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున ట్విట్టర్ వేదికగా వెల్లడించడంతో అంతా షాక్ అయ్యారు. ఇక చైతు-శోభిత త్వరలోనే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే శోభిత పేరు గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఆమె ఏ పోస్ట్ పెట్టినా నిమిషాల్లో వైరల్ అయిపోతుంది. తాజాగా, శోభిత బేబీ బంప్‌ ఫొటోతో పాటు మరికొన్ని కూడా షేర్ చేసింది.

అయితే అవి ‘లవ్ సితార’ షూటింగ్ సమయంలోని పిక్స్ అనే క్యాప్షన్ జత చేసింది. ప్రమోషన్స్‌లో భాగంగా ఆ ఫొటోలు షేర్ చేసినట్లు తెలుస్తోంది. ఇక బేబీ బంప్ ఫొటోని సడెన్‌గా చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఆ తర్వాత షూటింగ్ ఫొటోలు అని తెలుసుకుని పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. కొందరు నాగచైతన్య మాజీ భార్య సమంతను కూడా మధ్యలోకి తీసుకు వస్తున్నారు.

(Credits to Shobhita Dhulipala Instagram Channel)

Advertisement

Next Story

Most Viewed