Shekhar Master: 'దేవర' సాంగ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన శేఖర్‌ మాస్టర్‌.. ఏమన్నారంటే?

by Kavitha |
Shekhar Master: దేవర సాంగ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన శేఖర్‌ మాస్టర్‌.. ఏమన్నారంటే?
X

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం దేవర. ఈ మూవీ రెండు పార్టులుగా రూపొందుతుంది. సముద్రం బ్యాక్ డ్రాప్‌లో తీర్చిదిద్దుతున్న ఈ సినిమా మొదటి పార్టును సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శేఖర్ మాస్టర్ 'దేవర' సాంగ్‌కు సంబంధించి అప్‌డేట్‌ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ..''దేవర'లో కంపోజ్‌ చేయబోయే పాట ఎలా ఉంటుందో చూసి చెప్పాలి. మీ అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను. డ్యాన్స్‌కు ప్రాధాన్యమున్నసాంగ్ ఇది. రెండు రోజుల్లో షూటింగ్‌ ప్రారంభం కానుంది'' అని తెలిపారు. అలాగే బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలోని పాటకు, విజయ్‌ హీరోగా రూపొందుతున్న 'ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌'లోని సాంగ్‌కు కొరియోగ్రఫీ చేశానని శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చారు.

కాగా ఎన్టీఆర్‌ సినిమాల్లోని 'బంతిపూల జానకి', 'లవ్‌ మీ అగైన్‌', 'దివి నుంచి దిగి వచ్చావా యాపిల్‌ బ్యూటీ' వంటి హిట్‌ పాటలకు శేఖర్‌ మాస్టరే కొరియోగ్రఫీ చేయగా.. మరోసారి ఈ కాంబినేషన్‌ రిపీట్‌కావడంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed