స్టేజ్‌పైనే కన్నీరు పెట్టుకున్న శేఖర్ మాస్టర్.. మేము డ్యాన్సర్స్ అంటూ ఎమోషనల్!

by Jakkula Samataha |
స్టేజ్‌పైనే కన్నీరు పెట్టుకున్న శేఖర్ మాస్టర్.. మేము డ్యాన్సర్స్ అంటూ ఎమోషనల్!
X

దిశ, సినిమా : స్టార్ డాన్స్ కొరియోగ్రాఫర్, మాస్ డ్యాన్సర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ స్టార్ హీరోలతో మాస్ స్టెప్స్ వేయిస్తూ తనకంటూ ప్రత్యేక క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. ఇక డాన్స్ మాస్టర్ అంటే మొదటగా ప్రభుదేవా, లారెన్స్ తర్వాత గుర్తొచ్చే పేర్ల తర్వాత శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఉంటారు. ఇక శేఖర్ మాస్టర్ డాన్స్‌కు ఫ్యాన్స్ ఎక్కువే. చిన్న పిల్లాడు కూడా శేఖర్ మాస్టర్ డాన్స్ కి ఫిదా అవుతుంటారు.

ఢీ సెలబ్రిటీ స్పెషల్ 1 డ్యాన్స్ షో అనే ప్రోగ్రాం విజయవంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఇక ప్రజెంట్ ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 డాన్స్ షో ప్రారంభమైంది. ఈ షోకి శేఖర్ మాస్టర్ , క్రేజీ బ్యూటీ హీరోయిన్ హన్సిక, మరో డాన్స్ మాస్టర్ గణేష్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 నుంచి ఓ ప్రోమోను విడుదల చేశారు.

అయితే ఈ ప్రోమోలో జబర్దస్త్ హైపర్ ఆది తనదైన పంచులతో నవ్వులు వర్షం కురిపించారు. ఆ తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క పర్ఫామెన్స్ తో డాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఇంతలో ఓ కంటెస్టెంట్ డ్యాన్స్ చేస్తూ హఠాత్తుగా ఆగిపోయాడు. అందరూ షాక్ అయ్యారు. కారణం ఏంటాని అడిగితే.. పక్కనే ఉన్న డ్యాన్సర్ గురించి ఆగిపోయాడు అంటూ సమాధానం చెప్పాడు. దీంతో ఒక్కసారిగా శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. దీంతో శేఖర్ మాస్టర్ స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్నారు.

డాన్స్ అంటే తనకు ఎంత ఇష్టమో ఆయన తన కన్నీళ్లతో చెప్పారు. మేము మేము డ్యాన్సర్స్ కదా మాకు డ్యాన్స్ తప్ప మరొకటి రాదంటూ భావోద్వేగానికి గురయ్యారు. డాన్స్ మిస్ అయితే మాస్టర్ ఎక్కడ వెళ్ళిపోతాడా.? మాస్టర్ వెళ్ళిపోతే మాకు ఎక్కడ పని పోతుందా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఫైనల్ టాస్క్ లో డ్యాన్సర్లు అదరూ అరిస్తే.. అంటూ ఎమోషనల్ అయ్యారు శేఖర్ మాస్టర్. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Advertisement

Next Story

Most Viewed