ఆ ఆలయంలోని కలశాన్ని తాకి చరిత్ర సృష్టించిన మొట్టమొదటి స్టార్ హీరోయిన్

by Anjali |   ( Updated:2023-10-14 08:16:47.0  )
ఆ ఆలయంలోని కలశాన్ని తాకి చరిత్ర సృష్టించిన మొట్టమొదటి స్టార్ హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ స్టార్ హీరోయిన్ స్నేహ గురించి సుపరిచితమే. అప్పట్లో ఈ హీరోయిన్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అద్భుతమైన నటనతో, కట్టుబొట్టుతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం స్నేహా సినీ పరిశ్రమలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాల్లో నటిస్తూ కెరీర్ పరంగా బిజీ అయిపోయింది. ఇకపోతే ఈమె సాక్షాత్తు మధుర మీనాక్షి దేవాలయంలోని కలశాన్ని ముట్టుకున్నారని.. దాన్ని తాకిన మొట్టమొదటి మహిళ స్నేహనే అంటూ నెట్టింట ఓ వార్త హల్ చల్ సృష్టిస్తోంది.

ప్రస్తుతం స్నేహ.. సుశీ గణేశన్ దర్శకత్వంలో హీరో ప్రశాంత్ సరసన ‘విరుంభం’ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీలో స్నేహా ఒక పల్లెటూరు అమ్మాయి పాత్రలో మెరవనుంది. కాగా, ఈ చిత్రంలోని ఒక సీన్‌లో భాగంగా.. మధురైలోని మీనాక్షి అమ్మవారి టెంపులో ఉన్న కలశాన్ని తాకే సన్నివేశం ఉండటంతో స్నేహా షూటింగ్‌లో భాగంగా ఆలయ గోపురంపై ఉన్నటువంటి కలశాన్ని ముట్టుకున్నారట. దీంతో ఆలయ ప్రధాన అర్చకులు.. ‘‘మీరు ఎంతో అదృష్టవంతురాలు. ఈ కలశాన్ని తాకిన ఫస్ట్ మహిళ మీరే.’’ అని చెప్పడంతో స్నేహా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారట.

Advertisement

Next Story