శర్వానంద్ ‘మనమే’ నుంచి ఫస్ట్ సింగిల్..

by Disha Web Desk 7 |
శర్వానంద్ ‘మనమే’ నుంచి ఫస్ట్ సింగిల్..
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోలో శర్వానంద్ ఒకరు. హిట్ ఫట్‌తో సంబంధం లేకుండా మంచి మంచి కథలను ఎంచుకుంటూ ఫ్యామిలీ ఆడియన్స్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో.. ఇటీవల ‘ఒకే ఒక జీవితం’ అనే సినిమాతో మంచి విజయం అందుకున్నారు. ఇక తర్వాత వచ్చిన సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఈ క్రమంలోనే మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించే ప్రయత్నంలో ఉన్నాడు శర్వానంద్. ఈ మేరకు ఆయన నటిస్తున్న తాజా సినిమా ‘మనమే’.

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో మోస్ట్ బ్యూటిఫుల్ నటి కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాధ్ నిర్మిస్తున్న ఈ చిత్రం.. తండ్రీకొడుకుల మధ్య జరిగే కథగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన టైటిల్ పోస్టర్, టీజర్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్న ఈ మూవీ నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఇక నా మాటే’ అంటూ సాగే ఈ సాంగ్స్.. సింగిల్ యువతకు బాగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది.




Next Story

Most Viewed