పదేళ్లలో చేయలేని పనులు 3 నెలల్లో చేయమనడం విడ్డూరం.. హరీశ్ రావుపై ప్రొ. కోదండరామ్ ఆగ్రహం

by Prasad Jukanti |
పదేళ్లలో చేయలేని పనులు 3 నెలల్లో చేయమనడం విడ్డూరం.. హరీశ్ రావుపై ప్రొ. కోదండరామ్ ఆగ్రహం
X

దిశ, డైనమిక్ బ్యూరో:ప్రజలను మోసం చేయడంలో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని దేశంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రజల సంపదను కొల్లగొట్టారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ పాలనలో ప్రజలకు చేసిందేమి లేదన్నారు. పదేళ్లు బీఆర్ఎస్ చేయలేని పనులను 3 నెలల్లో చేయాలన్న హరీశ్ రావు వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. బీజేపీ నిరుద్యోగుల శాతాన్ని పెంచిందని ధ్వజమెత్తారు. శనివారం యాదాద్రి భువనగిరిలో తెలంగాణ జనసమితి జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన కోదండరామ్ బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. నిత్యావసర ధరలు పెరిగి సామాన్యులకు అప్పులు పెరిగాయని దీంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సామాన్య ప్రజల జీవితాలు మెరుగుపడాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.

Advertisement

Next Story