మాజీ భర్తకు సపోర్టుగా నిలిచిన నటి.. తన కోసమే అది చూశానంటున్న.. దల్జీత్ కౌర్ !

by Prasanna |
మాజీ భర్తకు  సపోర్టుగా నిలిచిన నటి.. తన కోసమే అది  చూశానంటున్న.. దల్జీత్ కౌర్ !
X

దిశ, సినిమా : హిందీ టెలివిజన్ నటి దల్జీత్ కౌర్ తన మాజీ భర్త షాలిన్ భానోత్‌కు మద్దతుగా నిలిచింది. ప్రస్తుతం 'బిగ్ బాస్ 16' లో కంటెస్టెంట్‌గా ఉన్న షాలిన్‌ను బాగా ఆడాలని ప్రోత్సహిస్తూ నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే సాధారణంగా ఈ వివాదాస్పద షోను రెగ్యులర్‌గా చూడనని గతంలో చాలా సార్లు చెప్పిన నటి తాజాగా రిలీజైన ప్రోమో చూసి ఉద్వేగానికి లోనైనట్లు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఎక్స్ హజ్బెండ్‌‌ను సపోర్ట్ చేస్తూ.. 'షాలిన్..నేను బిగ్‌బాస్‌ షో ఎప్పుడూ చూడలేదు. కానీ నీ కోసం ఈ సారి చూశాను. ఈ ప్రయాణంలో మీకు పూర్తిగా మంచి జరగాలని కోరుకుంటున్నా. న్యాయంగా ఆడండి. ప్రతి టాస్క్‌ను మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ విజయం సాధించండి. ప్రేక్షకుల హృదయాలను గెలవండి. మీ దల్జీత్' అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. 2009లో వివాహం చేసుకున్న ఈ దంపతులు 2015లో విడాకులు తీసుకోగా..ఒక కొడుకు కూడా ఉన్నాడు.

Advertisement

Next Story

Most Viewed