1000 కోట్లు దాటిన షారుఖ్ 'పఠాన్' కలెక్షన్స్..

by Hamsa |
1000 కోట్లు దాటిన షారుఖ్ పఠాన్ కలెక్షన్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ అగ్రహీరో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే జంటగా నటించిన చిత్రం 'పఠాన్'. దీనికి సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వం వహించాడు. విడుదలకు ముందే ఈ సినిమా ఎన్నో వివాదాలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సత్తా చాటింది.

భారీ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. రిలీజైన ఐదు రోజులకే 550 కోట్లు వసూల్ చేసి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం రూ.వెయ్యి కోట్ల మార్క్‌ను దాటింది. షారుఖ్ కెరీర్‌లోనే వెయ్యి కోట్లు కొల్లగొట్టిన మొదటి చిత్రంగా పఠాన్ నిలిచింది. రూ.1000 కోట్ల కలెక్షన్లపై చిత్ర బృందం అధికారికంగా పోస్టర్ విడుదల చేసింది.

Advertisement

Next Story