‘జవాన్’ నుంచి వీడియో క్లిప్స్ లీక్.. కేసు ఫైల్ చేసిన షారుఖ్ కంపెనీ

by Prasanna |   ( Updated:2023-08-12 13:52:56.0  )
‘జవాన్’ నుంచి వీడియో క్లిప్స్ లీక్.. కేసు ఫైల్ చేసిన షారుఖ్ కంపెనీ
X

దిశ, సినిమా : షారుఖ్ ఖాన్ అప్ కమింగ్ మూవీ ‘జవాన్’ సెప్టెంబర్ 7న విడుదల కానుంది. కానీ ఇప్పుడే ఈ సినిమా నుంచి వీడియో క్లిప్స్ లీక్ కావడంతో మూవీ యూనిట్ ఆందోళన చెందుతోంది. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ రెడ్ చెల్లీస్.. కాపీ రైట్ యాక్ట్‌ వయోలెట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ముంబైలోని శాంటాక్రూజ్ పీఎస్‌లో ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేసింది. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కేసు నమోదు కాగా ఆగస్టు 10న కంప్లయింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ‘జవాన్’ నుంచి వీడియోలు లీక్ కావడం ఇది రెండోసారి. కాగా ఏప్రిల్‌లో వీడియోస్ లీక్ అయినప్పుడే ఢిల్లీ హైకోర్టు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్, కేబుల్ టీవీ అవులెట్స్, షేడీ వెబ్‌సైట్స్‌కు ఆ క్లిప్స్ రిమూవ్ చేయాలని హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఈ చిత్రం షూటింగ్ జరిగేటప్పుడు సెట్‌లో మొబైల్ ఫోన్స్, డివైజెస్‌ బ్యాన్ చేసినా ఇలా జరగడంపై అభిమానులు ఫీల్ అవుతున్నారు.

Advertisement

Next Story