Sharukh Khan ధరించిన ఈ వాచ్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

by Hamsa |   ( Updated:2023-08-18 15:56:40.0  )
Sharukh Khan ధరించిన ఈ వాచ్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నాలుగేళ్ల తర్వాత 'పఠాన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటించగా.. సిద్దార్థ్ ఆనంద్, దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ప్రకటించిన కానుండి ఎన్నో వివాదాలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. వాటన్నిటినీ దాటుకుని ఎట్టకేలకు జనవరి 25న విడుదలై బాక్సాఫీసును బద్దలు కొట్టింది. భారీ కలెక్షన్లు రాబట్టి రికార్డ్స్ బ్రేక్ చేసింది. అయితే దీపికా పదుకొనె, షారుఖ్‌కుతో కలిసి ఉన్న ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ''నేను ఈ అందమైన వ్యక్తితో నా కెరీర్ ప్రారంభించాను. ఇప్పుడు మేము కలిసి నాలుగు సినిమాలు చేశాము. మా చర్మ సంరక్షణ కోసం కలిసి వెళ్లడం అనేది మొత్తం వేరే లెవల్ ఆనందం'' అంటూ రాసుకొచ్చింది. ఈ వీడియోలో షారుక్ ఖాన్ పెట్టుకున్న వాచ్ ధర ఏకంగా 4.98 కోట్లు పెట్టి కొన్నారట. ఓ వ్యక్తి స్క్రీన్ షాట్ ద్వారా ఈ విషయాన్ని తెలపడంతో అది కాస్త వైరల్ అవుతుంది. ఈ బ్లూ సిరామిక్ చేతి వాచ్‌ను షారుక్ ఖాన్ 'పఠాన్' కార్యక్రమంలో కూడా ఈ గడియారాన్నే ధరించాడట. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Advertisement

Next Story