- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Shaakuntalam Movie Review: శాకుంతలం మూవీ రివ్యూ.. సినిమా హిట్టా,ఫట్టా తెలుసుకోండి!
దిశ, వెబ్‌డెస్క్ : గుణశేఖర్ దర్శకత్వంలో సమంత, దేవ్ మోహన్ జంటగా తెరకెక్కిన సినిమా శాకుంతలం.ఈ సినిమాని డైరెక్టర్ ఎంతో ఇష్టంగా తెరకెక్కించాడు. ఇక ఈ మూవీ పాన్ ఇండియాలెవల్లో తీసుకెళ్లారు. అంతే కాకుండా సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ రోజు సినిమా విడుదలైంది. కాగా, మూవీ ఎలా ఉంది, ప్రేక్షకులను ఈ సినిమా ఎంత వరకు మెప్పించగలిగిందో చూద్దాం.
కథలోకి వెళ్లితే.. విశ్వామిత్రుడు చేస్తున్న తపస్సును భంగం చేయడానికి మేక(మధు బాల)ను భూలోకానికి పంపిస్తాడు ఇంద్రుడు. దీంతో మేనక విశ్వామిత్రుని తపస్సుకు భంగం కలిగిస్తుంది. ఈ క్రమంలో వారు శారీరకంగా కలవడంతో వారికి ఆడపిల్ల జన్మిస్తుంది.ఇక తమ ప్రేమకు గుర్తుగా పుట్టిన పాపను దేవలోకం తీసుకెళ్లలేక మేన పాపను భూమిమీదే విడిచిపెట్టి వెళ్లి పోతుంది.
ఇక ఎంతో అందంగా, ఉండే ఆ పాపను చూసిన శాకుంతలం పక్షులు ఆ పాపను కణ్వమహర్షి ఆశ్రమానికి తీసుకెళ్తాయి. ఆయన పాపకు శకుంతల అని పేరు పెడుతారు. అతర్వాత పాప అక్కడే పెరిగి పెద్దది అవుతుంది. ఇక క్రూర మృగాలను కాపాడే దుష్యంతుడు ఒక రోజు కణ్వమహర్షి ఆశ్రమానికి వెళ్తాడు. మొదటి చూపులోనే శకుంతల, దుష్యంతుడు ప్రేమలో పడుతారు. గాంధర్వ వివాహంతో వారిద్దరూ ఒకటవుతారు.
ఆ తర్వాత దుష్యంతుడు తన రాజ్యానికి వెళ్లి త్వరలోనే తిరిగి వచ్చి పట్ట మహిషిగా ప్రజలకు పరిచయం చేస్తానని శకుంతలకు మాటిస్తాడు. తాను ఆమెను ప్రేమించినందుకు గుర్తుగా తన ఉంగరాన్నిస్తాడు. ఆ తర్వాత కణ్వ మహర్షి ఆశ్రమానికి దుర్వాస మహా ముని(మోహన్‌బాబు) వస్తాడు. అప్పటికే గర్భవతి అయిన శకుంతల భర్త రాక కోసం ఎదురు చూస్తూ దుర్వాస మహాముని రాకను గుర్తించదు. దీంతో దుర్వాసుడు భర్త ఆమెను మర్చిపోతాడని శపించి వెళ్లిపోతాడు. శాపం వలన దుష్యంతుడు సమంతను గుర్తించడు. తర్వాత వీరి జీవితంలో ఏం జరిగింది. దుష్యంతుడు సమంతను ఎలా గుర్తిస్తాడు? గర్భవతితో ఉన్న శకుంతల ఎన్ని అవమానాలను ఎదుర్కొంటుంది. చివరకు తన భర్త దుష్యంత్తుని ఎలా కలుస్తుంది అనేది సినిమా స్టోరీ.
ఇక ఈ స్టోరీ అందరికీ తెలిసనదే అయినా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, నాసిరకం త్రీడీ హంగులతో సినిమాకు మైనస్ అయ్యాయని చెప్పవచ్చు. అలాగే మూవీలో ట్విస్టులు, బలమైన సంఘర్షణలు లేకపోవడంతో కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది.
ఫస్ట్ ఆఫ్ శకుంతల పుట్టుక, దుష్యంతునితో ప్రేమాయణం కాస్త పర్వాలేదనిపించినా, సెకండ్ ఆఫ్ కాస్త బాగుంటుంది. శాకుంతలం మూవీ అసలు కథ అంతా సెకండాఫ్‌లోనే సాగుతుంది. ఇక సమంత తన నటనతో ఆకట్టుకుందని చెప్పాలి. సినిమాకు ఫ్లస్‌గా సమంత నటను చెప్పవచ్చు, ప్రేమికురాలిగా, భర్తకు దూరమైన భార్యగా సమంత తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఇక దుష్యంత మహారాజుగా దేవ్ మోహన్ తన నటనతో అంతగా ఆకట్టుకోలేదు. అలాగే అల్లు అర్జున్ గారాల పట్టీ అల్లు అర్హ మూవీలో కనిపించింది కొద్దిసేపే యినా ఆమె తన ముద్దు ముద్దు మాటలతో తన పాత్రకు న్యాయం చేసింది. ఇక ఈ మూవీలోని సాంగ్స్ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. మొత్తానికి చూస్తే సినిమా అభిమానుల అంచానాలను రీచ్ కాలేకపోయిదని అభిప్రాయం.
Read more:
సమంత ఖాతాలోనే శాకుంతలం భారీ డిజాస్టర్‌గా మిగిలిపోతుందా?
పవన్ సినిమా సెట్స్ నుంచి నాలుగు సార్లు పారిపోయనంటున్న సుప్రియ