బిచ్చగత్తెలా రోడ్డు పక్కన మతిస్థిమితం లేక పడి ఉన్న సీరియల్ నటి.. పాపం చెత్త కుండలో తిండి తింటూ(వీడియో)

by Sujitha Rachapalli |   ( Updated:2024-04-14 15:15:12.0  )
బిచ్చగత్తెలా రోడ్డు పక్కన మతిస్థిమితం లేక పడి ఉన్న సీరియల్ నటి.. పాపం చెత్త కుండలో తిండి తింటూ(వీడియో)
X


దిశ, సినిమా : పాపులర్ హిందీ సీరియల్ హీరోయిన్ ప్రియాంకా చాహర్ చౌదరి దారుణమైన దుస్థితిని ఎదుర్కొంటుంది. రోడ్డు పక్కన చెత్త కుండి దగ్గర మతిస్థిమితం లేని పరిస్థితుల్లో కనిపించింది. ఓ చిన్న పాప అదే చెత్త నుంచి చపాతీ తీసి తినిపిస్తున్న వీడియో వైరల్ అవుతుంది. పరిశీలనగా చూస్తే కానీ ప్రియాంక అని గుర్తుపట్టని ఈ క్లిప్పింగ్ చూసి ఆమె ఫ్యాన్స్ బాధ పడుతుండగా.. ఇదంతా ఓ సీరియల్ షూటింగ్ లో భాగమేనని తెలుస్తుంది.

ఇక ఇదంతా పక్కన పెడితే ఈ వీడియోలో దీనస్థితిలో కనిపించిన ఈ సీరియల్ నటి చేతికి డైమండ్ రింగ్ ఉండటం ట్రోలింగ్ కు కారణం అవుతుంది. సీరియల్ ఆడియన్స్ అంత పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? బిచ్చగత్తెకు డైమండ్ రింగ్ ఏంటి డైరెక్టర్ గారు అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే సీరియల్ ప్రేక్షకులు మాత్రం అందులో కూడా ఏదో సీక్రెట్ ఉండి ఉంటుందని అంటున్నారు.


Advertisement

Next Story

Most Viewed