దర్శకుడితో Jyothi Rai రెండో పెళ్లి.. Instagram Viral Post..!

by Hamsa |   ( Updated:2023-08-01 04:11:31.0  )
దర్శకుడితో Jyothi Rai రెండో పెళ్లి.. Instagram Viral Post..!
X

దిశ, వెబ్ డెస్క్: ‘గుప్పెడంత మనసు’ సీరియల్ నటి జ్యోతి రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందులో సంప్రదాయంగా నటించిన ఈమె సోషల్ మీడియాలో బోల్డ్‌ ఫొటో షూట్స్‌తో రెచ్చిపోతుంది. కన్నడ ఇండస్ట్రీలో ఫేమస్ అయిన నటి దాదాపు 20 కి పైగా సినిమాల్లో కనిపించి మెప్పించింది.

ఇటీవలే శాండల్‌వుడ్‌ భామ యువ దర్శకుడితో రిలేషన్‌లో ఉందంటూ ఇటీవలే ఓ వార్త చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె ట్విటర్‌ హ్యాండిల్‌లోనూ జ్యోతి పుర్వాజ్ అనే పేరు పెట్టుకోవడంతో ఆమె రెండో పెళ్లి చేసుకుందని అందరికీ అనుమానం వచ్చింది.

తాజాగా, జ్యోతిరాయ్ తన ఇన్‌స్టాస్టోరీలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. ‘‘మీకు తెలియకుండా.. అర్థం కాకుండా ఎవరినీ నిందించొద్దు. మీరు ఎవరు కూడా నా వెంట నడవలేరని గుర్తు పెట్టుకోండి’’ అంటూ సుకు పూర్వాజ్‌తో పాటు తన కుమారుడితో ఉన్న ఫోటోను పంచుకుంది. అయితే ఆ పోస్ట్ నెటిజన్లను ఉద్దేశించి పెట్టిందా లేదా ఎవరి గురించి పెట్టిందనేది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి : Dhalapathi Vijay సినిమా డిజాస్టరని ముందే తెలుసు.. Thamannah షాకింగ్ కామెంట్స్



Advertisement

Next Story