Bigg Boss-8:రెండో కంటెస్టెంట్‌గా సీరియల్ నటుడు

by Jakkula Mamatha |   ( Updated:2024-09-01 14:37:54.0  )
Bigg Boss-8:రెండో కంటెస్టెంట్‌గా సీరియల్ నటుడు
X

దిశ,వెబ్‌డెస్క్:బుల్లి తెర ప్రేక్షకులకు పండగే పండగ..ఎందుకంటే అందరూ ఎప్పటినుంచో ఎదురు చూస్తోన్న తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-8 గ్రాండ్‌గా ఈ రోజు ప్రారంభం అయింది. ఈ సారి ఆట ఎలా ఉండబోతుందా? అని చాలా మంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కింగ్ నాగార్జున హోస్ట్‌గా అయితే, కంటెస్టెంట్స్‌లో ఈ సారి 7గురు అమ్మాయిలు, 7గురు అబ్బాయిలు హౌస్ లోకి వెళుతున్నట్లు రిలీజ్ ప్రోమోలో తెలిసింది.

అయితే నాగ్ ఒక్కొక్కరిని స్టేజ్‌పై పిలుస్తుండగా..స్టేజ్ పై స్పేషల్ పర్ఫార్మెన్స్‌తో ఎంట్రీ ఇస్తున్నారు. అయితే మొదటి కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి యష్మి గౌడ వెళ్లింది. ఇక రెండో కంటెస్టెంట్‌గా ఎవరు వెళ్తారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నక్రమంలో గోరింటాకు సీరియల్‌తో మంచి పేరు సంపాదించుకున్న నిఖిల్ మళయాల్కల్ హౌస్‌లోకి వెళ్లారు. ఇతడు పుట్టి పెరిగిందంతా కర్ణాటకలోని మైసూర్‌లో చిన్నప్పటి నుంచే నటనపై ఇష్టం ఉండటంతో 2016 లో కన్నడ భాషలో ఊటీ అనే సినిమా చేశాడు. అనంతరం కన్నడలో ‘మలయే మంత్రాలయ’ సీరియల్‌తో తొలిసారి నటించాడు. తెలుగులో ఛాన్స్ రావడంతో ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. ఈ మధ్యే ‘ఊర్వశివో రాక్షసివో’ సీరియల్‌లో అలరించాడు. ఇప్పుడిలా బిగ్‌బాస్‌లో అడుగుపెట్టాడు. యాక్టివ్‌గా ఉంటూ పంచులు వేసే ఈ నటుడు ఇప్పుడు హౌస్ లో ఎలా ఉంటాడో చూడాలి. ఆ తర్వాత సినీ నటుడు అభయ్ (పెళ్లి చూపులు ఫేమ్), టీవీ నటి ప్రేరణను ఇంకో జోడీ చేసి ఇంట్లోకి పంపించారు.

Advertisement

Next Story

Most Viewed