డాన్స్ షోలో రాధ, సదాది పనికిమాలిన జడ్జిమెంట్.. ఎలా ఇవ్వాలో వారికి తెలియదంటూ నటి కూతురు సంచలన పోస్ట్

by Disha Web Desk 6 |
డాన్స్ షోలో రాధ, సదాది పనికిమాలిన జడ్జిమెంట్.. ఎలా ఇవ్వాలో వారికి తెలియదంటూ నటి కూతురు సంచలన పోస్ట్
X

దిశ, సినిమా: నటి ఉమాదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె పలు సీరియల్స్, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. తాజాగా, ఉమాదేవి పెద్ద కూతురు తనుషా ఓ డాన్స్ షో పై సంచలన పోస్ట్ పెట్టింది. స్టార్ మాలో ప్రసారమవుతున్న నీతోనే డాన్స్ షో జోడీలు, జడ్జీలపై విరుచుకుపడింది. ‘‘స్టార్ మా వాళ్లు నీతోనే డాన్స్ రాని వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారని తెలిసిందే. లిప్ సింక్ ఉండదు. జంటల మధ్య సింక్ ఉండదు. అంతా గజిబిజి గందరగోళంలా ఉంటుంది. అయినా కానీ ఫుల్‌కి ఫుల్ మార్స్ ఇస్తారు.

కేవలం ఒక్క జంటకు మాత్రమే కాదు అందరికీ అంతే చేస్తారు. మరి వాళ్ళు ఏం జడ్జెస్ అనేది నాకు తెలియడం లేదు. అయినా హీరోయిన్స్‌ను తీసుకొచ్చి జడ్జీల కింద కూర్చోపెడితే ఏం తెలుస్తది వాళ్లకి. నాకు ఒకటి అర్థం కాదు డాన్స్ 2.0 అంటే డాన్స్ ఉండాలి. కానీ బిగ్‌బాస్ నేహా చౌదరి, విశ్వ జంట ప్రతిసారి జిమ్నాస్టిక్స్ చేస్తారు. ఎవరికైనా టాలెంట్ ఉందంటే. యూస్ చేసుకోవచ్చు కానీ ప్రతిసారి ప్రతి డాన్స్‌లో జిమ్నాస్టిక్స్ చేయడం కరెక్ట్ కాదు. ఈ జడ్జిలు కూడా అసలు ఇలా జడ్జిమెంట్ ఎలా ఇస్తారో? అర్థం కాదు. పనికిమాలిన జడ్జిమెంట్ అంతే. ఏదో జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. ఆర్టిస్టులను పోషించాలి అంతేకానీ డాన్స్ అంటే ఏంటి? అసలు జడ్జిమెంట్లు ఎట్లా ఇవ్వాలని కూడా తెలియకుండా ఉన్నారు’’ అంటూ రాసుకొచ్చింది.

అలాగే మరో జంట ఫొటో షేర్ చేస్తూ.. ‘‘ఈ కన్నడ జంట సోషల్ మీడియా ఐడీలు నాకు తెలియదు. అయితే వారికి తెలుగు సాంగ్స్, లిరిక్స్ రావు అయినా ఫుల్ మార్క్స్ ఇచ్చేయాలి. ఇది అయినా కానీ మన తెలుగు వాళ్ళు కన్నడ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అదే మన తెలుగు వాళ్ళు వెళ్లి కన్నడ డాన్స్ షోలో సీరియల్స్ గాని చేస్తామని అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? తెలుగు వాళ్ళు కొంచెం ఆలోచించి మనవాళ్ళని ఎంకరేజ్ చేయండి’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు పోస్టులు నెట్టింట దుమారం రేపుతున్నాయి.










Next Story

Most Viewed