ఇన్‌స్టాలో 400 మిలియన్ల ఫాలోవర్స్.. మొదటి మహిళగా సెలీనా

by Hamsa |   ( Updated:2023-03-19 12:55:21.0  )
ఇన్‌స్టాలో 400 మిలియన్ల ఫాలోవర్స్.. మొదటి మహిళగా సెలీనా
X

దిశ, సినిమా: హాలీవుడ్ సింగర్ సెలీనా గోమెజ్ సోషల్ మీడియాలో ఓ అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో 400 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్న మొదటి మహిళగా నిలిచింది. గతంలో కైలీ జెన్నర్ అత్యధిక సంఖ్యలో 382 మిలియన్ల మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను కలిగి ఉండగా.. తాజాగా ఆమెను బీట్ చేస్తూ సెలీనా మొదటి స్థానానికి దూసుకెళ్లింది. ఇదిలావుంటే.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెట్టింట ఓ హృదయపూర్వక సందేశాన్ని పంచుకున్న సెలీనా.. తన చిన్ననాటి ఫొటోతో పాటు, యువతుల కోసం విలువైన సలహాలను అందించింది. భావోద్వేగపూరితమైన ఆమె సందేశం చాలామంది యువతుల్ని కదిలించగా నెట్టింట తెగ వైరల్ అయింది.

Also Read: ఓ వదినా.. చమ్కీల అంగిలేసి పాట పాడింది ఎవరే.. దీ కోసం గూగుల్ లో తెగ సెర్చింగ్..

Advertisement

Next Story

Most Viewed