Tollywood: రేపటి కోసం అంటూ.. ఏపీ ప్రభుత్వానికి భారీ విరాళాన్ని ప్రకటించిన వైజయంతీ మూవీస్

by Prasanna |   ( Updated:2024-09-05 12:51:45.0  )
Tollywood:  రేపటి కోసం అంటూ.. ఏపీ ప్రభుత్వానికి భారీ విరాళాన్ని ప్రకటించిన వైజయంతీ మూవీస్
X

దిశ, వెబ్ డెస్క్: గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడలో రికార్డు స్థాయిలో వర్షాలు పడటం ఇదే మొదటి సారి. ప్రస్తుతం ఎక్కడ చూసిన నీళ్ళే.. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలా వలన అన్నీ నీట మునిగిపోయాయి. విజయవాడ నగరంతో పాటు చుట్టూ పక్కల ప్రాంతాలు కూడా అల్లాడిపోతున్నారు. ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు.

ఈ క్రమంలోనే వరద బాధితులను సాయం చేసేందుకు స్వచ్చంద సంస్థలు, ప్రముఖులు, సెలబ్రిటీలు ప్రభుత్వానికి విరాళాలు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే నిర్మాత బన్నీ వాసు విరాళాన్ని ప్రకటించాడు. ‘ఆయ్’ మూవీ వారం కలెక్షన్స్ లో 25 శాతాన్ని జనసేన పార్టీ తరపున ఇస్తున్నానని తెలిపాడు.

ఈ నేపథ్యంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ కూడా సాయం చేయడానికి ముందుకొచ్చింది. సీఎం సహాయ నిధికి రూ.25లక్షలు విరాళం ప్రకటిస్తూ.. రేపటి కోసం అంటూ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “ఈ రాష్ట్రం మాకు చాలా పెద్ద సాయమే చేసింది. ప్రకృతి పరంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న రాష్ట్రానికి ఇప్పుడు మేము సహాయం చేయాలనుకుంటున్నాం.. ఇది మా బాధ్యత” అంటూ రాసుకొచ్చింది.

Click Here For Twitter Link




Advertisement

Next Story