ఆ వేదికే నీకు జీవితాన్నిచ్చిందని మరిచావా? రాధికపై సయంతని ఫైర్

by Prasanna |
ఆ వేదికే నీకు జీవితాన్నిచ్చిందని మరిచావా? రాధికపై సయంతని ఫైర్
X

దిశ, సినిమా: టెలివిజన్ పరిశ్రమపై రాధికా మదన్ చేసిన వ్యాఖ్యలను నటి సయంతని ఘోష్ తప్పుపట్టింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ అనుభవాలను పంచుకున్న రాధిక ఒకే షిప్ట్‌లో 50 గంటలు పనిచేశానని, సెట్స్‌కు చేరిన తర్వాత దర్శకులు స్క్రిప్ట్ రెడీ చేస్తారని విమర్శనాత్మకంగా మాట్లాడింది. అంతేకాదు సెట్ కన్‌ఫర్మ్ అయ్యాక కూడా మార్పులు చేసేవారని, ఖాళీగా ఉంటేనే డైరెక్టర్లు షూట్‌కు వస్తారంటూ కాంట్రవర్సీకి తెరలేపింది. దీంతో రీసెంట్‌గా స్పందించిన సయంతని.. 'నేను ఆమె పూర్తి ఇంటర్వ్యూ చూడలేదు. కానీ, ఆమె మాట్లాడిన తీరు మాకు బాధ కలిగించింది. నిరాశకు గురిచేసింది. టీవీ వందల మంది మహిళలకు ఉపాధి కల్పిస్తుందనే విషయం మరవొద్దు. సినిమా స్టార్లు తమ చిత్రాలను ప్రచారం చేసుకోవడానికి టీవీని ఎంచుకుంటున్నారు' అంటూ ముక్కుసూటిగా చెప్పేసింది. చివరగా మౌనీ రాయ్ రియాక్ట్ అవుతూ.. 'నా ప్రియమైన స్నేహితురాలు టీవీతోనే తన కెరీర్‌ ప్రారంభించిన విషయం మరిచినట్లుంది. ఒక్క సినిమా అవకాశం రాగానే టీవీని తక్కువగా చూస్తోంది. అలా ఎప్పుడూ చేయకూడదని భావిస్తున్నా' అని తెలిపింది.

Advertisement

Next Story