జాన్వీ కపూర్ బాటలో మరో బాలీవుడ్ బ్యూటీ.. తెలుగులో ఎంట్రీ ఇచ్చేందుకు ఈగర్‌గా వెయిటింగ్!

by sudharani |
జాన్వీ కపూర్ బాటలో మరో బాలీవుడ్ బ్యూటీ.. తెలుగులో ఎంట్రీ ఇచ్చేందుకు ఈగర్‌గా వెయిటింగ్!
X

దిశ, సినిమా: బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, సలార్, కల్కి వంటి చిత్రాలు ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో పాటు.. గ్లోబల్ రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్నాయి. దీంతో ప్రజెంట్ తెలుగు సినీ పరిశ్రమ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగుతుంది. ఈ క్రమంలోనే తెలుగు సినిమాల్లో నటించడానికి ఇతర ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ భామలు టాలీవుడ్‌పై కన్నేస్తున్నారు. ఇక ఇప్పటికే కియారా అద్వానీ, కృతి ససన్, శ్రద్ధా కపూర్, దీపికా పదుకొణె తదితరులు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా.. జాన్వీ కపూర్ కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ ‘దేవర’లో నటిస్తున్న జాన్వీ.. రామ్ చరణ్‌తో ఓ సినిమా సైన్ చేసింది.

ఇదిలా ఉంటే.. జాన్వీ కపూర్ బాటలోనే మరో బాలీవుడ్ బ్యూటీ తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చేందుకు చూస్తుందట. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్. మంచి కథ కోసం సారా వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. మంచి కథ, సరైనా జోడి దొరికితే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు ఈగర్‌గా వెయిట్ చేస్తుందట. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ.. ఈ అమ్మడు నిజంగా టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తుందో లేదో వేచి చూడాల్సి ఉంది.

Next Story

Most Viewed