- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్కూల్లో వేధింపులకు గురవుతున్న సానియా మీర్జా కుమారుడు..
దిశ, సినిమా: సానియామీర్జా-షోయబ్ మాలిక్ ఇటీవల విడాకులతో వేరైన సంగతి తెలిసిందే. వివాహబంధానికి పుల్ స్టాప్ పెడుతూ ఇద్దరు విడాకులు తీసుకున్నారు. దీంతో వెంటనే షోయబ్ మాలిక్ పాకిస్తాన్ నటి సనా జావేద్ ని మూడో పెళ్లి చేసుకున్నాడు. ఇక వీరిద్దరు విడినపోయి ఎవ్వరి లైఫ్ వారు చూసుకున్నప్పటికి సానియా-మాలిక్ లకు పుట్టిన కుమారుడు ఇజాన్ తండ్రి మూడవ వివాహం కారణంగా స్కూల్లో వేధింపులు ఎదుర్కుంటున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
అంతే కాదు తన తల్లితండ్రుల కారణంగ ఇజాన్ మానసిక క్షోభకి గురవుతున్నాడని పాక్ మీడియాలో ప్రచారం సాగుతోంది. కానీ దీని గురించి వాస్తవం తెలియాల్సి ఉంది. అయితే దీనిపై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. ‘భార్యభర్తలు విడిపోతే ఆ ప్రభావం బిడ్డలపై పడుతుంది’ అంటూ ‘అందుకే పిల్లల భవిష్యత్ ని దృష్టి లో పెట్టుకుని భార్యభర్తలుగా విడిపోయినా స్నేహితులుగా కలుస్తూ తల్లిదండ్రులుగా వారి బాధ్యతలు నిర్వర్తించాలి’ అని అంటున్నారు. మరి నెటిజన్లు అన్నట్లుగా ఇజాన్ విషయంలో షోయబ్ మాలిక్ -సానియా తల్లితడ్రులుగా బాధ్యతలు తీసుకుంటారా? ఇజాన్ విషయంలో వాళ్ల నిర్ణయాలు ఎలా ఉంటాయి? అన్నది తెలియాల్సి ఉంది.