టాలీవుడ్ స్టార్ హీరోను రెండో పెళ్లి చేసుకోబోతున్న సానియా మీర్జా?

by Jakkula Samataha |   ( Updated:2024-05-20 06:30:27.0  )
టాలీవుడ్ స్టార్ హీరోను రెండో పెళ్లి చేసుకోబోతున్న సానియా మీర్జా?
X

దిశ, సినిమా : భారత టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మధ్య ఈమె ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్ క్రికేటర్ షోయబ్ మాలిక్‌ను పె ళ్లి చేసుకొని, విడాకులు తీసుకున్న తర్వాత ఈమెకు సంబంధించిన ప్రతి న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది.

సానియా పాక్, భారత్ సరిహద్దులను కూడా లెక్క చేయకుండా షోయబ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తర్వాత పలు కారణాల వలన వారు విడాకులు తీసుకొని విడిపోయారు. డివోర్స్ అనంతరం షోయబ్ రెండో పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటున్నాడు. కానీ సానియా మాత్రం రెండో పెళ్లిపై ఎప్పుడూ స్పందించలేదు. అయితే తాజాగా పాక్ నటుడు సానియా రెండో పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. విడాకులు తీసుకుంటే లైఫ్ ముగిసిపోయినట్లు కాదు.. సానియా మీరు వివాహం చేసుకోండి అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెర మీదకు వచ్చింది. సానియా టాలీవుడ్ స్టార్ హీరోను రెండో పెళ్లి చేసుకోబోతుదంట. ఆమె ఓ స్టార్ హీరోతో ప్రేమలో ఉందని, ఇప్పటికీ ఆ ప్రేమ కంటిన్యూ అవుతోంది.. ఆ హీరోనే రెండో పెళ్లి చేసుకో అని పాక్ నటుడు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది.

Advertisement

Next Story