Samyuktha Menon: అతడితో పెళ్లి పీటలెక్కబోతున్న సంయుక్తా మీనన్..!

by Prasanna |   ( Updated:2023-12-27 08:53:28.0  )
Samyuktha Menon: అతడితో పెళ్లి పీటలెక్కబోతున్న సంయుక్తా మీనన్..!
X

దిశ, సినిమా: మలయాళ బ్యూటీ సంయుక్తా మీనన్.. టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. 'భీమ్లా నాయక్', ' బింబిసార ', ' సార్ ', 'విరూపాక్ష ' వంటి వరుస హిట్స్ తర్వాత.. డిసెంబర్ 29న ‘డెవిల్’ మూవీతో మన ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు పెళ్లి పీటలెక్కబోతున్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఓ అబ్బాయితో ప్రేమలో ఉన్న బ్యూటీ.. ఈ విషయాన్ని తన పేరెంట్స్ కి చెప్పగా వాళ్ళు కూడా ఓకే చేసినట్లు తెలుస్తుంది. అయితే సంయుక్త పెళ్లి చేసుకోబోయేది వేరే మతానికి చెందిన అబ్బాయట. దీంతో పెళ్లి తర్వాత తన పేరు చివర ఉన్న ట్యాగ్ కూడా తీసేస్తుందట. అంతేకాకుండా సంయుక్త ‘డెవిల్’ సినిమా తప్ప మరో ప్రాజెక్ట్ ఇప్పటివరకు ఓకే చేయలేదు. అంటే దీన్ని బట్టి చూస్తే తనకి ‘డెవిల్’ చివరి చిత్రం కావచ్చు అంటున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story

Most Viewed