Samantha birthday : సమంత బర్త్‌డే.. అభిమాని సర్‌ప్రైజ్ ఇదే..!

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-28 15:24:09.0  )
Samantha birthday : సమంత బర్త్‌డే.. అభిమాని సర్‌ప్రైజ్ ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: నటి సమంత నేడు తన 36వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అయితే ఆమె వీరాభిమాని ఆమెకు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చారు. బాపట్ల జిల్లా చండూరు మండలం ఆలపాడుకు చెందిన సందీప్ ఆమె కోసం ప్రత్యేకంగా గుడి కట్టించిన సంగతి తెలిసిందే. సమంత బర్త్ డే కానుకగా ఆయన కట్టించిన గుడిని ప్రారంభించారు. స్థానికులు సమంత గుడిలో ఫోటోలు దిగేందుకు తరలివచ్చారు. సందీప్ గుడి వద్ద కేక్ కట్ చేసి అందరికి స్వీట్స్ పంచాడు. ఈ గుడి కోసం రూ. 3.7 లక్షలు ఖర్చు చేసినట్లు సందీప్ తెలిపారు. చిన్నారుల కోసం సమంత సేవలకు ఫిదా అయిన సందీప్ ఆమెకు గుడి కట్టి వార్తల్లో నిలిచారు.

ఇవి కూడా చదవండి:

Rajinikanth: ఆ విషయం ప్రపంచానికి తెలుసు.. చంద్రబాబుపై రజినీకాంత్ కీలక వ్యాఖ్యలు

Next Story

Most Viewed