సరికొత్త అవతార్‌‌లో సామ్.. 'ది మిషన్ ఈజ్ ఆన్' అంటూ

by Prasanna |   ( Updated:2023-02-01 13:26:56.0  )
సరికొత్త అవతార్‌‌లో సామ్.. ది మిషన్ ఈజ్ ఆన్ అంటూ
X

దిశ, సినిమా : స్టార్ నటి సమంత మరో బ్యూటిఫుల్ ఫొటోతో అభిమానులను ఆశ్చర్యపరిచింది. కొంతకాలంగా 'మయోసైటీస్' వ్యాధి కారణంగా నీరసంగా కనిపిస్తున్న ఆమె ఇటీవలే కాస్త ఫిట్‌నెస్ పెంచుకున్నట్లు వెల్లడించింది. కాగా చెప్పినట్లుగానే తన వర్కౌట్స్‌కు సంబంధించిన మోటివేషన్ వీడియోను షేర్ చేసిన సామ్.. తాజాగా తాను దాదాపు కోలుకుంటున్నట్లు గుడ్ న్యూస్ చెబుతూ అదిరిపోయే లుక్‌లో అట్రాక్ట్ చేసింది. ఈ మేరకు ఫిబ్రవరి 17న 'సిటాడెల్' తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆమె.. లూజ్ హెయిర్, స్టైలిష్ గాగుల్స్, జర్కిన్ వేసుకున్న ఫొటోను ఇన్‌‌స్టాలో పోస్ట్ చేసింది. 'ది మిషన్ ఈజ్ ఆన్. వీ హ్యావ్ స్టార్టెడ్ రోలింగ్ ఫర్ ది ఇండియన్ ఇన్‌స్టాల్‌మెంట్ ఆఫ్ 'సిటాడెల్'' అని తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ గురించి అప్‌డేట్ ఇచ్చింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న సూపర్ స్టైలిష్ ఫొటోను చూస్తూ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి:

డేటింగ్ రూమర్స్‌పై స్పందించిన శిల్పా శెట్టి సోదరి..

Advertisement

Next Story

Most Viewed