- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భగవద్గీత చదువుతూ.. జీవిత సత్యాన్ని తెలుసుకుంటున్న సమంత! పోస్ట్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ఇప్పటికే తాను ఒప్పుకున్న సినిమాల నుంచి తప్పుకుంది. అలాగే తీసుకున్న రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసింది. ఇటీవల విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చింది. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకుంటుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులతో అభిమానులకు దగ్గరగా ఉంటుంది.
తాజాగా, సామ్ తన ఇన్‌స్టా స్టోరీలో ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. భగవద్గీత చదువుతున్న ఫోటోస్ షేర్ చేసింది. అంతేకాదు.. ఏ భాగాన్ని చదువుతుందో చూపించింది. దీంతో ఈ పోస్టును చూసిన నెటిజన్లు సమంత భగవద్గీత చదువుతూ జీవిత సత్యాలను నేర్చుకుంటుందని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల సమంత ‘ఖుషి’ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించాడు. ఈ చిత్రంలో సామ్, విజయ్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. అలాగే ఇందులోని సాంగ్స్ సైతం మ్యూజిక్ లవర్స్‌ను కట్టిపడేశాయి. ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదలై హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.