- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాగచైతన్య రెండో పెళ్లి చేసుకుంటే.. ‘పీక పిసికి చంపుతా’నంటున్న సమంత.. షాక్లో ఫ్యాన్స్
దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘జోష్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత ‘ఏమాయ చేశావే’ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ మూవీలో నటించిన సమంతతో ప్రేమలో పడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల రీత్యా విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. ఇక విడాకుల తీసుకున్నప్పటి నుంచి వీరిద్దరూ ఏదో ఒక విధంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతునే ఉన్నారు. ఈ క్రమంలోనే నాగచైతన్య గురించి ఓ న్యూస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. అదేంటంటే..?
నాగచైతన్య ఎప్పటికైనా రెండో పెళ్లి చేసుకోక తప్పదు. కానీ నాగచైతన్య రెండో పెళ్లి చేసుకుంటే మాత్రం వచ్చిన అమ్మాయిని పీక పిసికి చంపుతా అని అంటుందంట ఆయన మాజీ భార్య సమంత. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్టు ఈమంది రామారావు ఈ సంచలన విషయం బయట పెట్టారు. ఆయన మాట్లాడుతూ.. యాంకర్ సమంత నాగచైతన్య మళ్లీ కలుస్తారని మీరు ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. అదెలా సాధ్యం అని రామారావుని అడగగా.. “నేను ఈ విషయం ఎప్పటినుంచో చెబుతున్నాను. ఇప్పటికే సమంత నాగచైతన్య నుండి దూరమైనందుకు ఎంతగానో మానసిక వేదన అనుభవిస్తుంది. అంతే కాదు చైతన్యను వదులుకొని నేను చాలా తప్పు చేశాను అని కుమిలిపోతుంది. ఈ విషయం నాకు తెలుసు. ఎందుకు ఆయన్ని మిస్ చేసుకున్నాను అని బాధపడుతుంది. అంతేకాదు ఒకవేళ నాగచైతన్య ఎవరైనా అమ్మాయిని రెండో పెళ్లి చేసుకుంటే మాత్రం ఆమెను సమంత పీక పిసికి చంపినా చంపుతుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఎప్పటికైనా సమంత నాగచైతన్యలు మళ్లీ కలుస్తారు. ఇదే నిజం” అంటూ ఈమంది రామారావు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతున్నది.