Samantha : రూట్ మార్చిన సమంత.. క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించబోతున్న బ్యూటీ!

by Jakkula Samataha |
Samantha : రూట్ మార్చిన సమంత.. క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించబోతున్న బ్యూటీ!
X

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య ఈ అమ్మడుకు సంబంధించిన ఏ న్యూస్ అయినా సరే ఇట్టే తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ నటి మయోసైటీస్ వ్యాధి బారిన పడిన తర్వాత కొన్ని రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తన ఆరోగ్యం పూర్తిగా కోలుకున్న తర్వాత సినిమాలు చేయాలని నిర్ణయించుకుంది. అయితే ప్రస్తుతం సమంత ఆరోగ్యం పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. అయితే గత కొన్ని రోజుల నుంచి సమంతకు ఆఫర్స్ రావడంలేదు, ఈమెకు అవకాశాలు లేకపోవడంతోనే సినిమాలు చేయడం లేదంటూ తెగ ప్రచారం జరిగింది. కాగా, ఆ రూమర్స్‌కు చెక్ పెడుతూ.. తాజాగా సమంత మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో తన అభిమానుల ముందుకు వచ్చింది.

ఇప్పటికే సామ్ తన పుట్టిన రోజు సందర్భంగా.. మా ఇంటి బంగారం అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ ప్రకటించిన విషయం తెలిసిందే. అదే విధంగా ప్రస్తుతం సమంత మరో ప్రాజెక్ట్‌ను ఓకే చేసిందంట. రక్త్ బ్రహ్మాండ్‌` పేరుతో వెబ్‌ సిరీస్‌ చేస్తున్నట్లు సమాచారం. రాజ్ డీకేలు ఈ సిరీస్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం దీనికి సంబంధిచిన పోస్టర్ ‌ను విడుదల చేస్తూ.. నెట్ ఫ్లిక్స్ తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటించింది. కాగా, ఇందులో సమంత కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం.


  • Dishadaily Web Stories

  • Advertisement

    Next Story

    Most Viewed